శ్రీశైలానికి ప్రధాన తూర్పు ద్వారం వద్ద శివుడి పాదముద్రలు
స్థల_పురాణం
శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి దేవస్థానము- త్రిపురాంతకం

లక్షా నలభై ఏడువేల నాలుగు వందల యాభై ఆరు చదరపు కి.మీ. వైశాల్యంకలిగిన నాలుగుద్వారములతోను నాలుగు ఉపద్వారములతోను విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రానికి త్రిపురాంతక క్షేత్రము తూర్పు ద్వారముగా మరియు నాలుగు ద్వారములు నాలుగు ఉప ద్వారములతో విరాజిల్లుచు శ్రీ చక్రాధారిత నిర్మాణముగా నిర్మించిన ప్రపంచములోని ఏకైక శివాలయంగా రాక్షస నిర్మాణమైన నైరుతి ద్వార ప్రవేశంగా ఉన్న మహిమాన్వితమైన స్కంద గిరీషులని ఆలయంగా పేరొందినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ క్షేత్రము త్రిపురాసుర సంహారం జరిగినట్లు పండితారాధ్య చరిత్ర చెప్పుతున్నది. త్రిపురాసుర సంహారం తరువాత శివుడు ఇచ్చట కుమారిగిరిపై త్రిపురాంతకేశ్వరునిగాస్వయంభువై వెలసినట్లు పార్వతీ మాత త్రిపురాంబగా స్కందమాత గా పూజలు అందుకొనుచున్నారు. కుమారగిరికి నైరుతి భాగంలో ప్రస్తుతం చెరువుగా ఉన్న చితగ్నిగుండం నుండి ఉద్భవించిన బాలాత్రిపురసుందరీ అమ్మవారు రాక్షస సంహారమునకు సహాయ పడినట్లు అనంతరంకదంబ వనమద్యలో బాలత్రిపురసుందరీదేవిగా వెలసినట్లు చెప్పబడుతున్నది. కుమారస్వామి తారకాసురుని సంహరించిది ఈ కొండపైననే అని అందున ఈ చలమునకు కుమారాచలం, కుమారారగిరి అని నామకరణములు వచ్చినట్లు త్రిపురాసుర సంహారము అనంతరం స్వామివారు ఆనందముగా తన పాదములను కొండపై గట్టిగా మోపి ఏడు క్రోసుల దూరంలోగల తన పాదంలను తదుపరి మోపిన కొండనే ప్రస్తుతం కోటప్పకొండగా పిలువబడుచున్నది. అందులనే ఇక్కడస్వామివారి పాదాలు దర్శనం ఇస్తున్నాయి. ఒకనాడు శ్రీశైల మహాక్షేత్రాన్ని కాలినడకన దర్శించవచ్చు యాత్రికులలో ఉత్తర భారతం మరియు ఆంధ్రప్రదేశ్ లోని సర్కార్ ప్రాంతములవారు ఈ త్రిపురాంతక క్షేత్రాన్ని దర్శించి శ్రీశైలానికి వెళ్ళేవారు ఇంతటి మహాక్షేత్రానికి గతంలో పుట్టెడు దాన్యము (తొమ్మిది బస్తాలు) నివేదనగా పెట్టెవారు. ఇటువంటి మహాక్షేత్రానికి నిజ జీవితంలో ఒక్కసారైన స్వామి అమ్మవార్లని దర్శించిన పూర్ణాయుష్కులుగా దివారాత్రిపాప పరిహారార్ధము అప మృత్యుగండ దోషములనుండి మరియు జన్మ నక్షత్ర దోషములనుండి నవగ్రహ దోషములనుండి విముక్తి పొందు ప్రతి భక్తుడు, భక్తులు ఈ క్షేత్రంలో నక్షత్ర ప్రదక్షిణ అనగా 27 సార్లు ప్రదక్షిణాలు చేసిన సర్వదోషములు నుండి విముక్తి పొందినట్లు పురాణాలు తెలియ జేస్తున్నాయి.
శివుడు త్రిపురాసురల అంతం అనంతరం ఆనందంగా పాదాలు బలంగా మోపిన ప్రాంతం ఇదే, త్రిపురాంతకం
త్రిపురాసురల అంతం చేసిన అనంతరం శివుడు ఈ విశేషమైన స్థలంలో వెలిశారు స్వయంగా, కుమార విజయం కుడా ఇక్కడే జరిగింది, ఇవన్ని శ్రీశైలానికి దగ్గరలో జరిగనవి
శ్రీశైల క్షేత్రానికి దగ్గరగా 80km దూరంలో ఉన్న త్రిపురాంతక క్షేత్రంలో
త్రిపురాంతకం : శ్రీశైల మహా క్షేత్రానికి ప్రధాన తూర్పు ద్వారం ఈ యొక్క త్రిపురాంతకేశ్వరుని ఆలయం 🙏
శ్రీశైలం ఒక మహాక్షేత్రం ఒక మహాశక్తి కేంద్రం
ఈ శ్రీశైల క్షేత్రానికి మొత్తం 8 ద్వారాలు ఉంటాయి
నాలుగు ప్రధాన ద్వారాలు నాలుగు ఉప ద్వారాలు
వీటిలో ప్రధాన ద్వారం త్రిపురాంతకం ఆలయం
ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశారు, స్వామివారి త్రిపురసురల అంతమొందించిన అనంతరం ఇక్కడ తన పాద ముద్రలను బలంగా మోపి తదుపరి పాదాలు మోపిన ప్రాంతమే కోటప్పకొండ ఆలయం, దక్షిణామూర్తి స్వరూపమైన త్రికోటేశ్వర స్వామి ఆలయం

ఈ రెండు ఆలయాలు కూడా కొంచెం వేరు వేరుగా ఉన్నప్పటికీ
శ్రీశైలానికి వెళ్లే మార్గ మధ్యంలో ఈ రెండు ఆలయాలు దగ్గర నే ఉంటాయి, త్రిపురాంతకం నుంచి శ్రీశైలానికి 80km దూరం ఉంటుంది
త్రిపురాంతకం ఆలయంలో స్వామివారి పేరు త్రిపురాంతకేశ్వరుడు అమ్మవారి పేరు త్రిపురంబా ఇక్కడ శ్రీచక్రం కుడా ఉంటుంది… అలాగే కొండ దిగువన చెరువు ప్రాంతం వైపు అమ్మవారు యోగాగ్ని నుంచి ఆవిర్భవించిన స్వయంభూ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి ఆలయం కూడ ఉంది ఈ రెండూ కుడా దర్శనము చేసుకోవాలి,
త్రిపురాంతకం ఒక విశేషమైన ఆలయం…
రుద్ర మంత్రాలతో చదివేటప్పుడు ప్రతి అలయంలోను త్రిపురాంతకేశ్వరుని నామ స్మరణ ఉంటుంది
నమస్తే అస్త్ భగవాన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ.. త్రిపురాంతకాయ.. ” 3 వ నామము ఇక్కడి స్వామివారి పేరే ప్రతి క్షేత్రంలో ఆలయంలో వివిధ పూజలలో వినిపిస్తుంది స్మరించబడుతుంది,
ఇక్కడ స్వామి విజయం అనంతరం ఆనందంగా వెలిశారు,
ఇది ఆనందానికి విజయానికి అలాగే శ్రీశైలానికి ప్రధాన ద్వారమై నిలిచి ఉన్నది,
ఈ ఆలయంలో మన తెలుగు శాసనాలకు పెట్టింది పేరు శాసనాలలో ” త్రిపురాంతక శాసనం” విశిష్టమైనది విలువైనది,
కాకతీయుల, చోళుళ, విజయనగర, రెడ్డి రాజుల, ఇలా ఎందరో శాసనాలు ఉన్నాయి ఈ ఆలయంలో,
తక్కువ రద్దీతో ప్రశాంతంగా ఈ ఆలయం ఉంటుంది, ఆలయం పచ్చని కొండల మధ్య పచ్చని పంటల మధ్య మనుష్యు ఆవరణ తక్కువ ఉన్న ప్రదేశం ఈ ఆలయం
అందరూ ఈ ఆలయాన్ని దర్శించండి,
జై శ్రీశైల క్షేత్రం… జై మల్లికార్జున..
జై త్రిపురాంతకేశ్వర స్వామి… 🙏
|| త్రిపురాంతకం – శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారం ||
మహా దేవుని నిజమైన పాదముద్రాలు త్రిపురాంతక క్షేత్రంలో చూడవచ్చు తాకవచ్చు…🙏🙏🙏
















