మన విశ్వవిద్యాలయాలు కేవలం సిద్దాంతాలను మాత్రమే నేర్పే కేంద్రాలుగా ఉండకూడదు. అవి యువతకు జ్ఞానం ఇవ్వడం మాత్రమే కాకుండా, నైపుణ్యాలను పెంపొందించి, ఉపాధి అవకాశాలను సృష్టించే వేదికలుగా మారాలి. ఇలా జరిగితే, విద్యార్థులు చదువుతో పాటు, స్థిరమైన భవిష్యత్తుకు సిద్దం అవుతారు, రాష్ట్ర సమాజానికి కూడా లాభం జరుగుతుంది.



















