కోనసీమ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి తొలి హారతి నిర్వహించగా, అనంతరం ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించి పుణ్యం పొందారు. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక వాతావరణంతో ఆలయం భక్తులతో కళకళలాడింది.




















