విజయవాడలో జరుగుతున్న ఆవకాయ ఫెస్టివల్‌లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. సంప్రదాయం–సంస్కృతి మేళవింపుతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంప్రదాయ వంటకమైన ఆవకాయకు ప్రత్యేకమైన రుచి ఉంది. కొత్త రాజధాని అమరావతితో ఆంధ్రప్రదేశ్ భారత్‌లో ప్రభావవంతమైన రాష్ట్రంగా ఎదుగుతోంది. వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక వృద్ధి రంగాల్లో పెట్టుబడులతో ఏపీ లీడింగ్ స్టేట్‌గా నిలుస్తూ, విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. ఈ డైనమిజం యూరోపియన్ యూనియన్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇండియా–ఈయూ భాగస్వామ్యం సెమీకండక్టర్స్, అగ్రి ఫుడ్, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, రక్షణ రంగాల్లో మరింత బలపడనుంది. ఈ బంధంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా నిలుస్తుంది. ఏపీ సంస్కృతి, కళలు, సినిమా ప్రపంచాన్ని ఆకర్షించాయి; రాజమౌళి సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లోని “నాటు నాటు” పాట నన్నెంతో ఆకట్టుకుంది. కూచిపూడి, కలంకారి, కొండపల్లి బొమ్మలు సమాజాలను దగ్గర చేస్తాయి. ఈ సాంస్కృతిక సంప్రదాయాలే ఈయూ–భారత్ భాగస్వామ్యాన్ని మరింత దగ్గర చేయనున్నాయి.



















