కామందక నీతిశాస్త్రంలో ఉన్న ఈ పద్యం పురుషుని ఆదర్శ స్వరూపాన్ని అద్భుతంగా వివరిస్తుంది
“కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయా తు రామః,
భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం — షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః.”
ఈ ఒక్క శ్లోకంలోనే ఒక ఆదర్శ పురుషుని ఆరు గుణాలను చూపించింది
- కార్యేషు యోగీ – పనులు చేసే సమయంలో యోగిలా ఉండాలి.
అంటే, ఫలితాన్ని ఆశించకుండా, కర్తవ్యాన్ని నిష్ఠగా నిర్వర్తించాలి. - కరణేషు దక్షః – కుటుంబ వ్యవహారాల్లో చాకచక్యంతో, సమయస్పూర్తితో వ్యవహరించాలి.
బాధ్యతతో, సమర్థతతో పనులు చేయగలగాలి. - రూపేచ కృష్ణః – రూపంలో కృష్ణుడిలా ఉండాలి.
ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా, చైతన్యంతో కనిపించాలి. - క్షమయా తు రామః – ఓర్పులో శ్రీరాముడిలా ఉండాలి.
మనసు పెద్దది చేసుకుని, తప్పులు మన్నించే గుణాన్ని అలవరచుకోవాలి. - భోజ్యేషు తృప్తః – భోజనంలో తృప్తిగా ఉండాలి.
భార్య లేదా తల్లి వండినదాన్ని ప్రేమగా, వంకలు పెట్టకుండా స్వీకరించాలి. - సుఖదుఃఖ మిత్రం – సుఖదుఃఖాల్లో కుటుంబానికి మిత్రుడిలా ఉండాలి.
ఆనందం, బాధ — రెండింటినీ పంచుకుంటూ, అండగా నిలవాలి.
ఈ ఆరు గుణాలు కలిగిన వాడు మాత్రమే నిజమైన ధర్మనాథుడు, ఉత్తమ పురుషుడు అని నీతిశాస్త్రం చెబుతుంది
ఆత్మనిబద్ధత, సమత, క్షమ, ఆనందం, తృప్తి, సహకారం ఇవే ఒక నిజమైన మనిషి యొక్క మానవ ధర్మాలు.




















