ఏలూరులో ఒక భవనాన్ని షెల్టర్ జోన్‌గా ఉపయోగిస్తున్న 15 మంది మావోయిస్టులను ఈ నెల 18న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని బుధవారం ఏలూరు మొబైల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఎన్. మేరీ 14 రోజుల రిమాండ్ విధించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనితో, కఠిన భద్రతా వ్యవస్థ మధ్య రెండు వాహనాల్లో ఈ 15 మంది మావోయిస్టులను పోలీసులు రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.



















