ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్‌కు పోటీగా విడుదలైన స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు యాప్ డౌన్‌లోడ్లు వేగంగా పెరుగుతుండగా, మరోవైపు ఇందులో సమాచార గోప్యత (Privacy) పై చర్చలు జోరుగా సాగుతున్నాయి. వాట్సాప్, సిగ్నల్ వంటి యాప్‌లు అందించే ‘ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్’ ఫీచర్ ఇందులో లేనందున విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ‘అరట్టై (Arattai App)’లో ప్రైవసీ అంశంపై జోహో (Zoho) సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం ప్రైవసీకి సంబంధించిన మూడు విభిన్న అంశాలు ఉన్నాయి:
- సీక్రెట్ లవర్స్
- వ్యక్తిగత డేటా వాడకం (Advertisements కోసం)
- సీక్రెట్ రెబల్స్
సీక్రెట్ లవర్స్: మా యాప్ ద్వారా జరిగే సంభాషణలు పూర్తిగా గోప్యంగా ఉండేలా మేము కృషి చేస్తున్నాం. అందుకు అనుగుణంగానే యాప్ డిజైన్ చేయబడుతోంది. సంస్థల వాణిజ్య రహస్యాలు, కాన్ఫిడెన్షియల్ డేటా మొదలైనవి కూడా ఈ కేటగిరీ కింద వస్తాయి.
వ్యక్తిగత డేటా: యూజర్ల వ్యక్తిగత డేటాను ప్రకటనల కోసం వాడకూడదని మేము ప్రతిజ్ఞ చేశాం. ఈ నిబంధనను ఎప్పటికీ ఉల్లంఘించం.
సీక్రెట్ రెబల్స్: ఇది దేశ చట్టాలకు సంబంధించిన అంశం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే రెబల్స్‌ను రక్షించడం సరైనది కాదు. కంపెనీల కంటే దేశ సార్వభౌమాధికారమే ముఖ్యమైనది. గూగుల్, యాపిల్ వంటి సంస్థలు భారత్‌లో పనిచేయాలంటే ఇక్కడి చట్టాలను పాటించాల్సిందే. జోహో కూడా అమెరికాలో అక్కడి చట్టాలకు లోబడే పనిచేస్తోంది.
సీక్రెట్ లవర్స్ లాగే సీక్రెట్ రెబల్స్ కూడా ‘అరట్టై’ యాప్‌లో సంభాషించవచ్చు. అయితే వారు చేసే కుట్రలు ఎప్పటికైనా బయటపడతాయని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంటుంది.
ఇకపై యూజర్ల ప్రైవసీ కోసం ‘అరట్టై’లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నామని శ్రీధర్ వెంబు తెలిపారు.



















