ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వ్యవసాయ, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు గారు సమీక్ష

October 9, 2025
in Andhra Pradesh News, Politics News
0
వ్యవసాయ, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు గారు సమీక్ష
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రైతు సేవ కేంద్రాలను రీ-ఓరియంటేషన్) చర్యలు తీసుకోవాలి – రైతులకు సేవాలందించేలా రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దాలి – రైతులకు ప్రభుత్వ సేవల విషయంలో రైతు సేవా కేంద్రాలు కీలక పాత్ర పోషించాలి – మంచి పోషక విలువల ద్వారా భూసారం పెంచాలి.. ఉత్పాదకత పెంచాలి – 2026 ఖరీప్ సీజన్ లో సేంద్రియ సాగు చేసేలా అవగాహన పెంచాలి – రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలి – ప్రకృతి సేద్యం ద్వారా ప్రయోజనాలు రైతులకు వివరించాలి – క్షేత్రస్థాయిలో ఉండేవారికి పూర్తిస్థాయి అవగాహన ఉండేలా చూడాలి – సీఎం చంద్రబాబు నాయుడు గారు

మార్కెట్ కమిటీల్లో మౌలిక సదుపాయాలకు మాస్టర్ ప్లాన్

రైతుసేవా కేంద్రాలను పునర్ వ్యవస్థీకరించండి

భూసారం పెంపుతో లాభసాటిగా సేంద్రీయ సాగు

రాష్ట్రంలో రైతు బజార్లను ఆధునీకరించండి

రైతుకు ధర దక్కాలి… వినియోగదారునికి ధర తగ్గాలి

అమరావతి, అక్టోబర్ 9:- రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న 218 మార్కెట్ కమిటీల స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి కె.అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ ఛైర్మన్లు, ఉన్నతాధికారులు హజరయ్యారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ అడిషన్ పై సీఎం దిశా నిర్దేశం చేశారు. అలాగే ఈ నెల 11వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్న పీఎం ధన్ ధాన్య కృషి యోజనపై కూడా సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”రైతులకు లాభం రావాలి… వినియోగదారునికి ప్రయోజనం కలగాలి. ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పని చేయాలి. రైతు బజార్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. పత్తికొండలో ఇటీవల కాలంలో టమాటో పంటకు ధర తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పంటను రైతు బజార్లకు తరలించి.. వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. కోల్డ్ చైన్ లాంటి వ్యవస్థలను ఉపయోగించుకుని టమాటో పంటలకు ధర తగ్గకుండా చూసుకోవాలి. రైతు బజార్లను ఆధునీకరించాలి. అర్బన్ ప్రాంతాల్లో రైతు బజార్ల ఆధునికీకరణకు భూమి ఎంత వరకు అవసరమవుతుందో అంచనా వేయాలి. రైతు బజార్లకు అనుసంధానంగా మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. మార్కెట్ కమిటీలను, రైతు బజార్లను అనుసంధానం చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దీని ద్వారా నిధుల సమీకరణ చేపట్టి… వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన జరిగేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ కోల్డ్ చైన్, అగ్రి ప్రాసెసింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి.” అని సీఎం ఆదేశించారు.

ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన

“రైతు సేవా కేంద్రాలను పునర్ వ్యవస్థీకరించేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు సేవలందించేలా రైతుసేవా కేంద్రాలను తీర్చిదిద్దాలి. రైతులకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించే విషయంలో రైతుసేవా కేంద్రాలే కీలక పాత్ర పోషించాలి. ఎక్కువ యూరియా వేస్తే ఎక్కువ పంట వస్తుందని.. ఆదాయం వస్తుందని రసాయన ఎరువులు, పురుగు మందులు ఎక్కువ వాడేస్తున్నారు. తద్వారా భూసారం క్షీణించడంతో పాటు వ్యాధులు వస్తున్నాయి. రసాయన ఎరువులు అధికంగా ఉపయోగించిన ఉత్పత్తుల వినియోగం కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మంచి పోషక విలువలు అందించటం ద్వారా భూసారం పెంచాలి… దాని ద్వారా ఉత్పాదకత పెంచాలి. 2026 ఖరీఫ్ సీజన్లో సేంద్రీయ సాగు పెంచేలా, ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలి. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణంతో పాటు ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలి. ఎలాంటి మార్పులు జరగాలన్నా… క్షేత్రస్థాయిలో ఉండేవారికి పూర్తి స్థాయి అవగాహన ఉండేలా చూడాలి. భూసారం పెంచే పోషకాల విషయంలో లోపాలను సవరించి తదుపరి ప్రణాళికలు చేసుకోవాలి. దశలవారీగా రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి.” అని సీఎం అన్నారు.

రబీ సీజన్‌కు పక్కా ప్రణాళిక

“రబీ సీజన్ కోసం 23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని సమీక్షలో అధికారులు వివరించారు. ఇప్పటికే జిల్లాలకు 41 వేల మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాలకు సరఫరా చేశామని అధికారులు చెప్పారు. పోర్టుల్లో 79,527 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ..“రబీ సాగు కోసం భూసార పరీక్షలు చేసి… ఆ డేటా ప్రకారం మైక్రో న్యూట్రియంట్స్ వేసుకునేలా రైతును ప్రోత్సహించండి. వచ్చే సీజన్‌కు భూసార పరీక్షలపై ఓ ప్రామాణిక విధానాన్ని రూపొందించండి. దుకాణాల వారీగా, రైతుసేవా కేంద్రాల వారీగా రికార్డులు నవీకరణ చేయాలి. భూసార పరీక్షల రిపోర్టుల ఆధారంగా ఎకరాకు ఎంత ఎరువు వినియోగించాలో రైతులకు దిశా నిర్దేశం చేయాలి. యూరియా ఎవరు తీసుకున్నారనే విషయాన్ని పూర్తి స్థాయిలో రికార్డులు నిర్వహించాలి. రైతులు, కౌలు రైతులకు ఎంత యూరియా సరఫరా చేశారన్న అంశంపై రికార్డులు పక్కాగా ఉండాలి. సాగు విస్తీర్ణం ప్రకారం ఎరువుల సరఫరా జరగాలి. యూరియాను డైవర్ట్ చేసిన ఉదంతాలు ఇటీవల కాలంలో చూశాం. ఆధార్ ఆథంటికేషన్ చేసి ఎరువుల సరఫరా జరగాలి. ఈ ఏడాది 90.91 లక్షల మెట్రిక్ టన్నుల మేర పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. 51 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం. ఇది గత ఏడాదితో పోలిస్తే 44 శాతం అధికం. టార్ఫాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచాలి.” అని చంద్రబాబు చెప్పారు.

ధన-ధాన్య కృషీ యోజన కింద రైతులకు కలిగే లాభాలపై అధ్యయనం

“హెడ్డీ బర్లీ పొగాకును రైతులు తక్కువ ధరకే అమ్ముకోకుండా చూడాలి. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకుకు రైతులకు రూ.96 కోట్లు చెల్లింపు చేశాం. హెచ్డీ బర్లీ పొగాకు పంటకు మార్కెట్ ఉండేలా చూడాలి. దీని కోసం పంటను కూడా అవసరమైన మేరకు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగు జిల్లాల్లో పొగాకుకు క్రాప్ హాలిడే ప్రకటించండి. త్వరలో ప్రధాని ప్రారంభించబోయే ధన-ధాన్య కృషీ యోజన కింద ఏ పంటకు ఎక్కువ లాభం వస్తుందో చూసుకుని ఆ పంటలను ప్రొత్సహించాలి. పప్పు దినుసుల విషయంలో వందశాతం కొనుగోళ్లు చేస్తామని కేంద్రం చెబుతోంది. ఈ పథకంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి.. రైతులకు ఎంత వరకు లబ్ది చేకూరుతుందో చూడండి. గతంలో ఏపీ కంటే కర్ణాటకలో సెరీకల్చర్ సాగు తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం… ఏపీ కంటే 8 రెట్లు అధికంగా సెరీకల్చర్ రంగంలో ఉత్పత్తి చేస్తోంది. ఎందుకు ఈ స్థాయిలో గ్యాప్ వచ్చిందో విశ్లేషించండి. సిల్క్ ఉత్పత్తికి సంబంధించి యంత్రాలను ఎంఎస్ఎంఈలో పెట్టి.. వాటిని సబ్సిడీ మీద సరఫరా చేసేలా చూడండి. బిల్ గేట్స్ ఫౌండేషన్ తో అగ్రిటెక్ పై కూడా పని చేస్తున్నాం. సెరీ కల్చర్ విషయంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకోండి. పట్టు పురుగుల సాగు ఉండే చోట ఇతర పంటల సాగులో ఎరువుల వినియోగం తక్కువగా ఉండేలా చూడండి. వ్యవసాయ -సెరీకల్చర్ శాఖలు సమన్వయంతో పని చేయాలి. ప్రతీ పంటపైనా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అధ్యయనం చేయాలి. రైతులకు వచ్చే పంట ఆదాయం, ఇతర ప్రత్యామ్నాయాలపై రీ-ఓరియంటేషన్ జరగాలి.” అని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రొత్సాహం

“ఉల్లి, టొమాటో, మిర్చి, మామిడి పంటల విషయంలో సాగు ఖర్చులు ఎంత వరకు ఉన్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. ఆయా పంటలకు ధరలు తగ్గకుండా ప్రణాళికలు చేసుకోవాలి. టేబుల్ వెరైటీతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పంపితే అసలు ధరలు పడిపోయి నష్టం వాటిల్లే అవకాశం ఉండదు. స్థానిక అవసరాలు, ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఎంతమేర పంపించాలన్న దానిపై ముందస్తు ప్రణాళికలు ఉండాలి. అరటి పంటకు దేశీయంగానూ, విదేశాల్లోనూ పెద్ద ఎత్తున వినియోగం ఉంది. ఉద్యాన పంటలను దేశీయ మార్కెట్టుతో పాటు ఎగుమతులు చేసేందుకు, లాజిస్టిక్స్ సవాళ్లు లేకుండా చూసుకోవాలి. వ్యవసాయ రంగంలో అనుబంధ ఉత్పత్తులుగా వచ్చే పుట్టగొడుగుల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. సర్క్యులర్ ఎకానమీలోకి పుట్ట గొడుగుల సాగును తీసుకురావాలి. రాష్ట్రంలో ఉన్న ఆవుల విసర్జితాలతో జీవామృతం తయారు చేసి ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించాలి. ఆవు పేడను దుబాయ్ దేశంలో ఖర్జూరపంటకు ఎరువుగా వినియోగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో కూలీల వ్యయం తగ్గేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలి. ప్లాంటేషన్, హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ అనేదే పకృతి సేద్యంలో కీలకం. కాఫీ గింజలకు సోకిన బెరిబోరర్ తెగులు నివారణకు జీవామృతం వినియోగించాలి.” అని ముఖ్యమంత్రి చెప్పారు.

జీలుగ, పట్టు ఉత్పత్తులను పరిశీలించిన సీఎం

ఈ సమీక్ష సమావేశంలో జీలుగు ఉత్పత్తులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన జీలుగు బెల్లాన్ని ముఖ్యమంత్రి రుచి చూశారు. అరకు కాఫీ తరహాలోనే జీలుగు ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతంలో వెదురు ఉత్పత్తుల విషయంలో దృష్టి సారించాలన్నారు. గిరిజన రైతులకు ఎక్కువ ఆదాయం లభించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సీఎం సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వివిధ పంటలకు సంబంధించిన మద్దతు ధరలు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి పోస్టర్ రిలీజ్ చేశారు. నాణ్యమైన పట్టుగూళ్లతో తయారు చేసిన ఉత్పత్తులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పట్టుగూళ్లతో తయారు చేసిన వస్త్రాలను, బొకేలను రాష్ట్రానికి వచ్చిన అతిథులకు అందించే దిశగా ఆలోచన చేయాలని సీఎం సూచించారు. పట్టుగూళ్లతో తయారు చేసిన బోకేను మంత్రి అచ్చెన్నాయుడు అందించి.. మల్బరీ పట్టు వస్త్రాన్ని సీఎం చంద్రబాబుకు బహుకరించారు.


ShareTweetSend
Previous Post

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి లేఖ: భయంతో, ఆందోళనతో ఉన్న ఐపీఎస్‌ అధికారి భార్య.. ముఖ్యమంత్రికి విన్నపం

Next Post

రాయవరం బాణసంచా పేలుడు ఘటనపై దర్యాప్తు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related Posts

పండగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లు
Andhra Pradesh News

పండగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లు

September 19, 2026
పేదలకు పట్టాభిషేకం.. 28,445 కుటుంబాలకు ఆస్తి హక్కు పత్రాలు
Andhra Pradesh News

పేదలకు పట్టాభిషేకం.. 28,445 కుటుంబాలకు ఆస్తి హక్కు పత్రాలు

September 19, 2026
శిథిల వంతెనలకు మోక్షమెప్పుడో?
Andhra Pradesh News

శిథిల వంతెనలకు మోక్షమెప్పుడో?

September 18, 2026
దీపం-2 రాయితీకి నిర్ణీత తేదీ.. లబ్ధిదారులకు ఇక స్పష్టత
Andhra Pradesh News

దీపం-2 రాయితీకి నిర్ణీత తేదీ.. లబ్ధిదారులకు ఇక స్పష్టత

September 18, 2026
రేణిగుంట రైల్వేస్టేషన్‌లో వ్యక్తి హంగామా.. రైలు పైకెక్కి ఆత్మహత్యాయత్నం
Andhra Pradesh News

రేణిగుంట రైల్వేస్టేషన్‌లో వ్యక్తి హంగామా.. రైలు పైకెక్కి ఆత్మహత్యాయత్నం

September 18, 2026
మోదీతోనే నదుల అనుసంధానం సాధ్యం: చంద్రబాబు
Andhra Pradesh News

మోదీతోనే నదుల అనుసంధానం సాధ్యం: చంద్రబాబు

September 18, 2026
Next Post
రాయవరం బాణసంచా పేలుడు ఘటనపై దర్యాప్తు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాయవరం బాణసంచా పేలుడు ఘటనపై దర్యాప్తు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 19, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 19, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 19 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 19 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 19, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

September 19, 2026
జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

September 19, 2026

Recent News

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

September 19, 2026
జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

September 19, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.