ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు సదరం సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం సేవలను పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వెల్లడించింది.
దివ్యాంగులు తమ మొబైల్ నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, అనంతరం సదరం సేవలను ఎంచుకోవచ్చు. ఈ విధానం ద్వారా సదరం స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న స్లాట్‌ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా సదరం సర్టిఫికెట్లను కూడా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. దివ్యాంగులు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా పొందేందుకు ఈ డిజిటల్ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ సదుపాయాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీజీఎస్ సూచించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















