తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించేందుకు తితిదీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది.
అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను ఈ కాలంలో నిర్వహించబోమని తెలిపింది. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















