తిరుమల, అక్టోబర్ 27: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం 8 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారని టిటిడి అధికారులు తెలిపారు. సర్వదర్శనం కోసం భక్తులకు సుమారు 10 గంటల సమయం పడుతుండగా, రూ.300 శీఘ్ర దర్శనం కోసం 2 నుండి 3 గంటల సమయం పడుతోంది.
సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు స్వామివారి దర్శనం కోసం 3 నుండి 5 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది.
నిన్న (అక్టోబర్ 26) రోజున మొత్తం 80,021 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 25,894 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
హుండీ ఆదాయంగా నిన్న స్వామివారి ఆలయానికి ₹3.90 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏




















