స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతానికి ఈ శుక్రవారం 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దాని భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.




















