పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగుతోందని ఎన్నారై వెంకట్ ఇక్కుర్తి తెలిపారు. ఇలాంటి మేలుకొలుపు కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించాలనే ఆలోచనలో ఉన్నామని ఆయన చెప్పారు.
గురువారం గుంటూరు–అమరావతి రోడ్డులోని అన్న క్యాంటీన్‌ను సందర్శించిన వెంకట్ ఇక్కుర్తి, అక్కడి నిర్వహణ తీరును పరిశీలించారు. స్వయంగా భోజనం చేసి ఆహారం రుచి, నాణ్యత చాలా బాగుందని ప్రశంసించారు. భోజనం చేస్తున్న వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు.
“నేను గుంటూరులోని బ్రాడీపేటకు చెందినవాడిని. గత 30 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్నాను, అక్కడ పౌరసత్వం పొందాను. ఆంధ్రప్రదేశ్‌లోని అన్న క్యాంటీన్ల గురించి అమెరికాలో మా స్నేహితుల మధ్య చర్చ జరిగింది. ఈసారి భారత్ వచ్చిన సందర్భంగా స్వయంగా క్యాంటీన్‌ను సందర్శించి పరిశీలించాను,” అని వెంకట్ ఇక్కుర్తి పేర్కొన్నారు.


















