రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. వివరాల ప్రకారం — హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తున్న బస్సు రెడ్డిగూడెం వద్దకు చేరుకునే సమయంలో, రోడ్డు విస్తరణ పనుల కోసం ఉంచిన పైపులకు ఢీకొని అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగింది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. అందరూ అత్యవసర ద్వారం ద్వారా సురక్షితంగా బయటపడ్డారు.




















