హైదరాబాద్–విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై అనేక చోట్ల తారు లేచిపోవడంతో రోడ్డు గుళికలు ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యమూ వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు చేసే ఈ జాతీయ రహదారిలో టోల్ వసూలుపై మాత్రమే శ్రద్ధ ఉంటుందని, రహదారి నిర్వహణపై దృష్టి లేకపోవడం వల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఎపిలింగోటం వద్ద తారు మాయం కావడంతో ఏర్పడిన గుళికలు ఈ చిత్రంలో చూడవచ్చు.




















