హస్తిన పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ భూములు బదలాయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ సమగ్రత, రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌లో వాయుసేన విమానాశ్రయం ఏర్పాటు అంశంపై కేంద్రానికి సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వాయుసేన టెర్మినల్‌తో పాటు కార్గో, ఎమ్‌ఆర్‌వో (Maintenance, Repair and Overhaul), హ్యాంగర్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. హ్యాంగర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ విమానాశ్రయం అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.
అలాగే దేవరకద్ర సమీపంలో ప్రతిపాదిత డీఆర్‌డీవో ప్రాజెక్టుకు త్వరితగతిన మంజూరు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి, రక్షణ రంగ సహకారానికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















