కంచికచర్ల మండలం వేములపల్లిలో సోమవారం నాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా ముక్కపాటి నరసింహారావు గారు అధికారిక ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం గారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ రంగ అభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర చాలా కీలకమని తెలిపారు. రైతులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు, నూతన చైర్మన్ నరసింహారావు గారు కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు.
కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం గారు కూడా నూతన బృందానికి శుభాకాంక్షలు తెలియజేయగా, వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకు తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, రైతు నాయకులు, స్థానిక రైతులు, సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.


























