టయోటా మోటార్ కార్పొరేషన్ సోమవారం సరికొత్త హైలక్స్ కారును ఆవిష్కరించింది. ఈ మోడల్‌లో డీజిటల్, ఫ్యూయల్ సెల్ వేరియంట్లతో పాటు, తొలిసారిగా బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. బీఈవీ హైలక్స్‌లో 59.2 కిలోవాట్-అవర్ లిథియం-ఐయాన్ బ్యాటరీ అమర్చబడినది, దీన్ని ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత 300 కి.మీ.కి పైగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 2026లో ఈ మోడల్‌ను ఆసియా మార్కెట్లలో విడుదల చేయనుంది. 2028లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఐరోపా, ఏషియాన్ మార్కెట్లలో లాంచ్ చేయాలని టయోటా భావిస్తోంది.




















