ఇది ఐలాండ్ జెమ్ సీతాఫలం, ప్రధానంగా ఆస్ట్రేలియాలో ఎక్కువగా పండుతుంది. జన్యుపరంగా ఉత్పత్తి పెంచేందుకు, సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో మూడేళ్ల క్రితం ఈ రకం మొక్కలు 20 విత్తనాలు నాటారు. ఇప్పుడు ఆ మొక్కలు ఫలాలు ఇస్తున్నాయి. ఫలాలు పూర్తిగా గుండ్రాకారంగా లేనప్పటికీ రుచిలో ఎంతో మధురంగా ఉంటాయి. సాధారణ సీతాఫలంతో పోల్చితే తీపి శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఫలంలో సగటున 4–5 గింజలు మాత్రమే ఉంటాయి. ఆరోగ్యానికి లాభదాయకమైన గుణాలు ఎక్కువగా ఉండడం గమనార్హం అని సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డా. సుచిత్ర తెలిపారు. ఈ రకపు మొక్కలను రైతుల కోసం అందుబాటులో ఉంచినట్లు కూడా వివరించారు.




















