సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతిగృహంలో కాపలాదారు మద్యం మత్తులో అన్నం వండిన పాత్రలో కాలుపెట్టి నిద్రించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు బుధవారం రాత్రి భోజనం చేయడానికి వసతిగృహంలోని భోజనశాలకు వెళ్లారు. అక్కడ కొన్ని నెలలుగా పనిచేస్తున్న తాత్కాలిక కాపలాదారు చంద్రశేఖర్ మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలు పెట్టి నిద్రిస్తుండడాన్ని గుర్తించారు. సరిగ్గా తినే సమయానికే అతను ఇలా చేయడంతో విద్యార్థులు ఆందోళన చెంది… వంట కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్లీ వంట చేసి విద్యార్థులకు వడ్డించారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ ప్రావీణ్య… వాచ్‌మేన్‌ను విధుల్లోంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.



















