ఐటీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దమ్మాలపాటి ఓం సాయి కృష్ణ కౌషిక్ వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు కౌషిక్, హరిణిలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.




















