వైఎస్సార్ కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్తు తీగలను ఒంటికి చుట్టుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నందలూరు మండలం మదనమోహనపురం పంచాయతీ పరిధిలోని వెంకటరాజంపేట గ్రామానికి చెందిన చింతకాయల వెంకటరత్నం (40) ఈ ఘటనలో మృతి చెందాడు.
నందలూరు ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరత్నం కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతనికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వెంకటరత్నం.. అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోయి ఎటో వెళ్లిపోయేవాడని పోలీసులు తెలిపారు.
కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వెంకటరత్నం కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. అతని భార్య బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లగా.. పిల్లలను చుక్కాయపల్లెలోని తన తల్లి వద్ద ఉంచినట్లు తెలిసింది. దీంతో వెంకటరత్నం ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో కొంతకాలంగా మనస్తాపానికి గురైన వెంకటరత్నం మంగళవారం తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. విద్యుత్తు తీగలను తన ఒంటికి చుట్టుకుని, వాటిలోని ఒక కొనను హెచ్‌టీ విద్యుత్తు లైన్‌కు తగిలించాడు. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















