తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సాధికారతకు మళ్లీ పెద్ద ఊరట కల్పించింది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అదనంగా 448 అద్దె బస్సులు కేటాయించబడ్డాయి. ఈ నిర్ణయాన్ని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రాష్ట్రంలో మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మొదటి విడతలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని 150 మహిళా సంఘాలకు 150 బస్సులు కేటాయించబడ్డాయి.



















