కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆర్వీఆర్ గ్రూప్ ఛైర్మన్ రావి వీర రాఘవ చౌదరి మరియు సౌభాగ్యలక్ష్మి దంపతులు రూ.కోటికి పైగా విలువైన వెండి మండపాన్ని బహూకరించారు. రూ.1,01,53,742 విలువ ఉన్న ఈ వెండి మండపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.తదుపరి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి సమక్షంలో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవర ప్రసాదరావుకు బహూకరణ అందజేశారు. ఈ వెండి మండపాన్ని స్వామివారి గర్భాలయంలో ఉంచారు. దేవస్థానానికి కోటి పైగా విలువైన బహూకరణ రావడం ఇదే మొదటిసారి అని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. రావి వీర రాఘవ చౌదరి దంపతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.



















