ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా , వెస్టిండీస్ మధ్య రేపటి నుంచి (గురువారం) అహ్మదాబాద్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాము.. 2024లో స్వదేశంలో టీమ్ఇండియాను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ ఫార్ములాను ఈ టూర్‌లో అనుసరిస్తామని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ అన్నాడు. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ 3-0 తేడాతో విజయం సాధించింది. స్వదేశంలో 12 సంవత్సరాలుగా ఒక్క సిరీస్ కూడా ఓడిపోని టీమ్ఇండియా రికార్డ్‌ను న్యూజిలాండ్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.
‘టెస్ట్ క్రికెట్‌లో ప్రస్తుతం మేం మంచి స్థితిలో లేము. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పట్టికలోనూ దిగువన ఉన్నాం. కానీ మేం వాటన్నింటినీ పక్కన పెట్టి టీమ్‌ఇండియాతో తలపడాలనుకుంటున్నాం. గత సంవత్సరం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించింది. తన ఆధిక్యతను ప్రదర్శించింది. మేం వారి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. మంచి క్రికెట్ ఆడి, పోటీ ఇవ్వాలని చూస్తాం. అలాగే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలనుకుంటున్నాం’ అని రోస్టన్ చేజ్.. నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా అన్నాడు.
‘మేం న్యూజిలాండ్, టీమ్‌ఇండియా మ్యాచ్‌ల పుటేజ్‌లను క్షుణ్నంగా పరిశీలించాం. కీలకమైన అంశాలను గుర్తించాం. వాటి నుంచి నేర్చుకున్నాం. నాకు గతంలో భారత్‌లో ఆడిన అనుభవమూ ఉంది. ఇక్కడ పిచ్‌లు స్పిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి. స్పిన్ బౌలర్లే ఎక్కువగా బౌలింగ్ చేస్తారు. మేం స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనే అంశంపై దృష్టి పెట్టాం’ అని రోస్టన్ చేజ్ పేర్కొన్నాడు.
భారత స్క్వాడ్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్, జగదీశన్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్
వెస్టిండీస్ జట్టు: కెవ్లాన్ అండర్సన్, బ్రాండన్ కింగ్, అలిక్ అథనాజ్, తాగెనరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్, షై హోప్, షమార్ జోసెఫ్, అండర్సన్ ఫిలిప్, జైదెన్ సీలెస్, ఖరీ పియర్




















