టీమ్‌ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ భావోద్వేగ వీడ్కోలు సందేశాన్ని పంచుకున్నారు. భారత జట్టుతో తన ఐదేళ్ల ప్రయాణం ఇటీవల జింబాబ్వే పర్యటనతో ముగిసింది. ఆయన కాంట్రాక్టును బీసీసీఐ పొడిగించకపోవడంతో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఘోష్‌ను నియమించింది.
టీమ్‌ఇండియాతో ఐదేళ్ల ప్రయాణాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదని దిలీప్ పేర్కొన్నారు. భారత క్రికెట్‌కు సేవ చేసే అవకాశం కల్పించిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎంతో ఇష్టపడే క్రికెట్‌లో ఫీల్డింగ్ విభాగం ద్వారా జట్టుకు తన వంతు సహకారం అందించానని చెప్పారు.
ప్రతి మ్యాచ్ తర్వాత అందించే ‘బెస్ట్ ఫీల్డింగ్ మెడల్’ తనకు ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతుందని దిలీప్ తెలిపారు. ఆ మెడల్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లలో ఎంతో ఉత్సాహాన్ని నింపేదని, దాన్ని అందుకునే సమయంలో ఆటగాళ్ల ముఖాల్లో కనిపించిన చిరునవ్వులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.
తన పదవీకాలంలో రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు ఆసియా కప్‌ల విజయాల్లో భాగం కావడం మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. అలాగే 2023 వన్డే ప్రపంచకప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ రన్నరప్‌గా నిలిచిన సమయంలోనూ జట్టుతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి కెప్టెన్లతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉందని దిలీప్ తెలిపారు. ఐదేళ్లపాటు టీమ్‌ఇండియా బ్యాడ్జ్‌ను ధరించే అవకాశం దక్కడం తనకు ఎప్పటికీ గర్వకారణమేనని చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















