పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మైకేల్ స్మిత్‌ను జాతీయ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. టెస్టులు, వన్డేలు, టీ20లు.. మూడు ఫార్మాట్లలోనూ పాక్ బ్యాటర్లకు శిక్షణ అందించనున్నారు.
విదేశీ గడ్డపై పాకిస్థాన్ బ్యాటర్లు స్థిరంగా రాణించలేకపోవడం, జట్టు బ్యాటింగ్‌లో తరచూ వైఫల్యాలు ఎదురవుతున్న నేపథ్యంలో పీసీబీ ఈ నియామకం చేపట్టింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్‌లో నిలకడ తీసుకురావడంతో పాటు కీలక మ్యాచ్‌ల్లో బ్యాటర్లు మెరుగ్గా రాణించేలా తీర్చిదిద్దే బాధ్యతను స్మిత్‌కు అప్పగించింది.
2003 నుంచి 2013 వరకు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన స్మిత్.. 89 ఫస్ట్‌క్లాస్, 72 లిస్ట్-ఎ, 16 టీ20 మ్యాచ్‌ల్లో కలిపి 7,029 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 40 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత లెవెల్-4 కోచింగ్ డిగ్రీ పూర్తి చేసి కోచ్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్ జట్లతో పనిచేసిన అనుభవం స్మిత్‌కు ఉంది. అలాగే ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్, టాస్మానియా జట్లకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ అనుభవంతో పాక్ బ్యాటింగ్ విభాగాన్ని స్మిత్ ఏ మేరకు గాడిలో పెడతాడనేది ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















