ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ మంత్రి ఆలోచన ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. కులం ఆధారంగా కాక, యువత నైపుణ్యాల ఆధారంగా డేటా సేకరించే ‘స్కిల్ సెన్సస్’పై మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టారు. మంగళగిరిలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ప్రయత్నంలో యువత నైపుణ్యాలను అంచనా వేయడం సవాలు అని నారా లోకేష్ గుర్తించారు. ఈ సాహసోపేతమైన నిర్ణయం విజయం సాధిస్తే, దేశానికే రోల్ మోడల్ అవుతుంది.



















