స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో 2026 సంవత్సరానికి సంబంధించిన వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. “జీవ వైవిధ్యం – ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం” అనే థీమ్‌తో అసెంబ్లీ సెక్రటేరియట్ ఈ క్యాలెండర్‌ను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా, రాష్ట్రంలోని వివిధ వన్యప్రాణులపై అవగాహన కల్పించే విధంగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను రూపకల్పన చేశారు. సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో చిత్రాలు ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య వారసత్వాన్ని, సీఎం ఆలోచనలను ప్రతిబింబిస్తోందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రకృతిని కాపాడుకోవాలనే మంచి సందేశాన్ని ఈ క్యాలెండర్ అందిస్తోందని పేర్కొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరించినందుకు ముఖ్యమంత్రికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.




















