కుటుంబ విభేదాల కారణంగా ఒక వివాహిత తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాతబస్తీలో నివాసమున్న వ్యాపారవేత్త పృథ్విలాల్, చార్టెడ్ అకౌంటెంట్ కీర్తిక అగర్వాల్ దంపతులు. వీరికి రెండేళ్ల కుమార్తె బియ్యారా ఉంది. వివాహిత, కుటుంబ గొడవల కారణంగా ఏడాదిన్నర క్రితం బహదూర్‌పురలోని తల్లిదండ్రుల వద్ద కుమార్తెతో ఉంటోంది. ఈ నెల 2న హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
సోమవారం, నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపంలో మృతదేహం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు తెలియక మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కీర్తిక తల్లిదండ్రులు తమ కుమార్తె, మనుమరాలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ కీర్తిక అగర్వాల్‌గా గుర్తించబడింది. పరిశీలనలో, ఆమె తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించగా, మంగళవారం చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.




















