నిన్న విశాఖపట్నంలో జరిగిన భారత్ vs దక్షిణాఫ్రికా వన్‌డే మ్యాచ్ అనంతరం టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు విరాట్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మ్యాచ్ ముగిశాక దేవాలయ దర్శనం కోసం కోహ్లీ రావడంతో అక్కడి భక్తులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కొంత సమయం ఆలయంలో గడిపిన కోహ్లీ తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు.




















