బిహార్‌లో మళ్లీ ‘జంగిల్‌రాజ్’ రావద్దంటే ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని కేంద్రమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దర్భంగా లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ఇటీవల బిహార్ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో జమ చేసిన రూ.10 వేల రూపాయలను ఉపసంహరించుకోవాలని ఆర్జేడీ నేతలు ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆ డబ్బును ఆర్జేడీ నేతలు స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. లాలూ తాతలు దిగొచ్చినా కూడా ఆ సొమ్మును దోచుకోలేరని స్పష్టం చేశారు.
అమిత్ షా మాట్లాడుతూ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ–నీతీశ్ అభివృద్ధి మోడల్‌కు, ఆర్జేడీ ఆటవిక పాలనకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బిహార్‌ను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపిస్తోందని చెప్పారు. ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే, ‘మిథిలాంచల్’ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు, వరదలను నివారించేందుకు, కోషి నది నీటిని వినియోగించుకునేందుకు రూ.26,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం బిహార్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వైశాలి జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ఆర్జేడీ నేతలు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెబుతున్నారు, కానీ ఆ కోసం కావాల్సిన నిధులు ఎక్కడినుంచి తెస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
యూపీఏ పాలనలో కేంద్రం బిహార్‌కు కేవలం రూ.2 లక్షల కోట్లు మాత్రమే కేటాయించిందని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం గత పదేళ్లలో రూ.15 లక్షల కోట్లు విడుదల చేసిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించగలదే ఎన్డీఏ ప్రభుత్వం, ఆర్జేడీకి అలాంటి దృష్టి లేదని ఆయన అన్నారు.




















