దేశంలో విద్యుత్తు వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా (FADA) వెల్లడించింది.గత నెలలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల రిటెయిల్ విక్రయాలు 13,733కి చేరాయి. 2025 ఫిబ్రవరిలో నమోదైన 9,505 వాహనాల అమ్మకాలతో పోలిస్తే ఇది 44 శాతం పెరుగుదలగా ఫాడా తెలిపింది. దేశంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నమోదైన వాహనాల వివరాల ఆధారంగా ఈ గణాంకాలను వెల్లడించారు.
కంపెనీల వారీగా చూస్తే టాటా మోటార్స్ అమ్మకాలు 4,020 నుంచి 38.5 శాతం పెరిగి 5,568కి చేరాయి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా విక్రయాలు 3,490 నుంచి 5 శాతం తగ్గి 3,312కు పరిమితమయ్యాయి. మరోవైపు మహీంద్రా విక్రయాలు 508 నుంచి 2,913కు భారీగా పెరిగాయి. అలాగే విన్‌స్టా 384 వాహనాలు, బీవైడీ ఇండియా 306 వాహనాలను విక్రయించాయి.ఇదే సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ కూడా భారీగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా 1,11,709 ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 76,722 వాహనాలతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధిగా ఉంది.
కంపెనీల అమ్మకాల విషయానికి వస్తే టీవీఎస్ మోటార్ విక్రయాలు 18,955 నుంచి 67 శాతం పెరిగి 31,614కు చేరాయి. బజాజ్ ఆటో 25,328 వాహనాలు విక్రయించగా, ఏథర్ ఎనర్జీ 20,584 వాహనాలు, హీరో మోటోకార్ప్ 12,514 వాహనాలు, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 4,724 వాహనాలు అమ్మాయి. మరోవైపు ఒకప్పుడు మార్కెట్లో ముందంజలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు 8,675 నుంచి 54 శాతం తగ్గి 3,968కు పరిమితమయ్యాయి.మొత్తంగా చూస్తే దేశంలో పర్యావరణహిత రవాణా వైపు వినియోగదారులు మరింతగా మొగ్గుచూపుతున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















