సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్ ప్రాంతంలో జరిగిన ప్రొజెక్టైల్ దాడి ఘటనపై స్పష్టత లభించింది. మొదట ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందాడనే వార్తలు సోషల్ మీడియాలో మరియు కొన్ని వర్గాల్లో ప్రచారం కావడంతో ఆందోళన నెలకొంది. అయితే ఈ విషయంపై సౌదీలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా స్పందిస్తూ ఆ వార్తలను ఖండించింది.
భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, అల్‌ఖర్జ్‌లోని ఒక నివాస ప్రాంతంలో పడిన ప్రొజెక్టైల్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కానీ వారు ఇద్దరూ బంగ్లాదేశ్‌కు చెందిన వారేనని సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు తరువాత స్పష్టం చేశారు. ఈ ఘటనలో భారతీయులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని భారత ఎంబసీ వెల్లడించింది. ఈ దాడిలో మొత్తం 12 మంది గాయపడగా, వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని వెంటనే అల్‌ఖర్జ్‌లోని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్థానిక సౌదీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అవసరమైతే బాధిత భారతీయుడికి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని ఎంబసీ పేర్కొంది.అలాగే సౌదీలో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని కూడా భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















