ప్రస్తుత జీవనశైలిలో ఏర్పడుతున్న ఆహార అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఎక్కువ మందిని బాధిస్తున్నాయి. క్యాన్సర్ కేసులు కూడా సంవత్సరానికొకసారి పెరుగుతున్నాయి. అసంక్రమిక వ్యాధుల వ్యాప్తిని తెలుసుకోవడానికి కూటమి ప్రభుత్వం చేపట్టిన NCDCD 3.0 సర్వే పూర్తయ్యింది. ఇందులో రక్తపోటు, షుగర్, క్యాన్సర్ బాధితుల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది.
ప్రజల ఆరోగ్య భద్రత కోసం నాలుగో విడత సర్వేను ఇటీవల ప్రారంభించారు. జిల్లాలో 18 ఏళ్లు పైబడి ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి, దీర్ఘకాలిక వ్యాధులపై సమగ్ర సమాచారం సేకరించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాతే తమకు ఇలాంటి వ్యాధులు ఉన్నట్లు చాలా మందికి తెలిసిందని అధికారులు చెబుతున్నారు. ప్రజలకు ఈ సమస్యలను తెలియజేసి వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్వో డా. లక్ష్మీనరసయ్య, ఆర్బీఎస్కే ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివప్రతాప్ తెలిపారు.
ఎన్సీడీడీసీ సర్వేలో గుర్తించిన వివరాలు:
- లక్ష్యంగా పెట్టుకున్న పరీక్షలు: 13,99,330
- పూర్తి చేసిన పరీక్షలు: 12,55,401
బాధితుల సంఖ్య:
- రక్తపోటు: 95,275 (10.03%)
- మధుమేహం: 78,633
- క్యాన్సర్ కేసులు: 489
- నోటి క్యాన్సర్: 146
- రొమ్ము క్యాన్సర్: 176
- గర్భాశయ క్యాన్సర్: 167




















