దేశీయ టెక్ సంస్థ జోహో తమ మెసేజింగ్ యాప్ అరట్టైలో (Arattai) కీలక అప్‌డేట్‌ను ప్రవేశపెట్టనుంది. త్వరలోనే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టెస్టింగ్ చివరి దశలో ఉంది అని కంపెనీ సీఈవో శ్రీధర్ వెంబు ఎక్స్‌లో తెలిపారు.
ప్రస్తుతానికి అన్ని చాట్‌లకు ‘ఆప్షన్-2’ ఎన్‌క్రిప్షన్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. భవిష్యత్తులో ప్రైవేట్ చాట్‌లు, గ్రూప్ చాట్‌లకు వేర్వేరుగా ఎనేబుల్ చేసుకునే ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది. విస్తృతస్థాయి పరీక్షల కారణంగా 6,000 మంది జోహో ఉద్యోగులు దీనిని టెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎదురైన సమస్యలను దాదాపు పరిష్కరించారని వెంబు తెలిపారు.
యూజర్లు ఎన్‌క్రిప్షన్ కోసం యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని, ఫీచర్ ఇప్పటికే సోర్స్ కోడ్‌లో ఉంచినప్పటికీ ఇప్పటివరకు ఎనేబుల్ చేయబడలేదని చెప్పారు.
సోషల్ మీడియాలో యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎన్‌క్రిప్షన్ ప్రైవసీ కోసం తీసుకురానా లేదా నియంత్రణ నిబంధనల కింద వుందా అనే ప్రశ్నలు ఉన్నాయి. అలాగే పాత చాట్‌ల కోసం ఏ విధానాన్ని అమలు చేస్తారో, యాప్‌ను మరింత ప్రమోట్ చేయాలని సూచనలు, త్వరగా ఫీచర్ అందకపోవడం మంచిదని సలహాలు కూడా వస్తున్నాయి.



















