ఈరోజు (04-03-2026)
విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో చేసిన శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. అయితే అస్థిర నిర్ణయాలు తీసుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. విష్ణు సహస్రనామాన్ని పఠించడం శుభప్రదంగా ఉంటుంది.
ఈవారం (01-03-2026 – 07-03-2026) మీ ఆత్మవిశ్వాసం బలంగా ఉంటే కఠినమైన పనులనైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు. సమయాన్ని వృథా చేయకుండా, పనులను వాయిదా వేయకుండా నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూలమైన కాలం కావడంతో మీ ప్రతి ప్రయత్నం లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు మృదువుగా, వివేకంతో వ్యవహరిస్తే అపార్థాలు నివారించవచ్చు. అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా స్వీకరిస్తే మీ పురోగతికి దోహదపడుతుంది. చంచలత్వాన్ని విడిచిపెట్టి స్థిరమైన మనస్సుతో ఆలోచిస్తే సమస్యలకు సరైన పరిష్కారాలు దొరుకుతాయి. వారం చివరలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. విష్ణునామ స్మరణ చేయడం ద్వారా మానసిక బలం, ప్రశాంతత పెరుగుతాయి.




















