ఈరోజు (04-03-2026)
మీ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. సమాజంలో మీ ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధనను నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించడం మంచిది.
ఈవారం (01-03-2026 – 07-03-2026)
మీ జీవితంలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకునే సమయం. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆదాయం పెరుగడంతో పాటు అదృష్టం కూడా మీవైపు ఉంటుంది, దీర్ఘకాలంగా ఆశించిన కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీరు చూపే నిబద్ధత, క్రమశిక్షణ అందరి ప్రశంసలను తెచ్చిపెడతాయి . అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సహకారం వల్ల ఇతరులకు మేలు జరుగుతూ, సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఏకాగ్రతతో చేసిన ప్రతి పనిలో ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. ఆత్మీయులతో సంతోషంగా గడపడం ద్వారా మానసిక ప్రశాంతత, ఉత్సాహం మరింత పెరుగుతాయి. శ్రీలక్ష్మీదేవి కటాక్షంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గి, జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది. శ్రీలక్ష్మీ ధ్యానం ఈ వారం శుభఫలితాలను అందిస్తుంది.




















