ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో బడ్జెట్ నిధుల వినియోగంపై అసహనం వ్యక్తం చేశారు. మార్చి 15లోగా కేటాయించిన నిధులను ఖర్చు చేసి, పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులందరూ “ప్రోయాక్టివ్” గా ఉండి బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనితీరు మార్చుకోని వారిని పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెడతానని సీఎం స్పష్టం చేశారు.


















