సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించారు. దేశ ఐక్యతకు పునాది వేసిన పటేల్ త్యాగాలు, దూరదృష్టి ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.




















