మంగళగిరి, అక్టోబర్ 31:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
తరువాత దివ్యాంగులు మరియు ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను సమీపంగా తెలుసుకోవడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.
అదే సమయంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూట్రిఫుల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. యాప్‌లో రోజువారీగా ఎన్ని మంది రిజిస్టర్ అవుతున్నారో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ఎలా మానిటర్ చేస్తున్నారో, రిజిస్టర్ అయిన వారికి ఎలా మార్గదర్శనం అందిస్తున్నారో ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సాంకేతికతను ఉపయోగించి ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార ప్రోత్సాహం లక్ష్యంగా న్యూట్రిఫుల్ యాప్ పనిచేస్తుందని, దీనిని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
























