ర్యాంక్’ అనే పదం సాపేక్ష స్థానం లేదా చోటును సూచిస్తుంది. ఒక వ్యక్తి లేదా వస్తువు స్థానాన్ని నిర్ధారించే ప్రక్రియ, కొద్దిమంది వ్యక్తులు లేదా వస్తువుల స్థానాలతో పోల్చడాన్ని ‘ర్యాంకింగ్’ అంటారు. పోటీపరీక్షల్లో ఈ విభాగం నుంచి ఒక వరుసలో/అంతస్తుల్లో వ్యక్తులు లేదా వస్తువుల స్థానాలు ఇస్తారు. వారు ఏ దిశ నుంచి ఏ స్థానంలో ఉన్నారో కనుక్కోమని అడుగుతారు. మరికొన్నిసార్లు స్థానాలు పరస్పరం మార్చుకుంటే మొత్తం వరుసలో ఎంత మంది ఉన్నారనే రకం ప్రశ్నలు సంధిస్తారు. సాధన నిత్యకృత్యం అయితే గెలుపు తీరం చేరడం తేలికవుతుంది.
























