ఉపాధ్యాయ వృత్తిని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ఎన్‌సీఈటీ (NCET) ఒక గొప్ప అవకాశం. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరియు ప్రముఖ డిగ్రీ కళాశాలల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ-బీఎడ్, బీఎస్సీ-బీఎడ్, బీకామ్-బీఎడ్ కోర్సుల్లో ప్రవేశం లభిస
పరీక్ష విధానం
- పరీక్ష ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో (MCQ) నిర్వహిస్తారు
- పరీక్ష వ్యవధి: 3 గంటలు
- మొత్తం 181 ప్రశ్నలు
- వీటిలో 160 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలి
- ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు
- ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగెటివ్
- పరీక్షను తెలుగు మాధ్యమంలో కూడా రాయవచ్చు
ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్ రెండేళ్ల సిలబస్ ఆధారంగా ఉంటాయి. పాఠ్యాంశాలపై పట్టు ఉన్నవారు సులభంగా రాణించగలరు
ప్రశ్నాపత్రం విభజన
సెక్షన్–1: భాషలు
- 38 భాషలలో ఏవైనా 2 భాషలు ఎంచుకోవాలి
- ఒక్కో భాష నుంచి 23 ప్రశ్నలు
- 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి
- కాంప్రహెన్షన్, సాహిత్యం, పదసంపద అంశాలపై ప్రశ్నలు
సెక్షన్–2: సబ్జెక్టులు
- 26 సబ్జెక్టులలో ఏవైనా 3 ఎంపిక
- ఒక్కో సబ్జెక్టు నుంచి 28 ప్రశ్నలు
- 25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి
- ఇంటర్ స్థాయి సబ్జెక్ట్ పరిజ్ఞానం ఆధారంగా ప్రశ్నలు
సెక్షన్–3: జనరల్ టెస్ట్
- 28 ప్రశ్నలు
- 25కి సమాధానం ఇవ్వాలి
- కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ & లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ
సెక్షన్–4: టీచింగ్ ఆప్టిట్యూడ్
- 23 ప్రశ్నలు
- 20కి సమాధానం ఇవ్వాలి
- బోధనా నైపుణ్యాలు, ఉపాధ్యాయ దృక్పథం అంశాలు
ఎక్కడ అవకాశాలు?
దేశంలోని పలు ప్రముఖ సంస్థలు ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ఐఐటీలు
ఖరగ్‌పుర్, భువనేశ్వర్, జోధ్‌పుర్, రోపార్ – ఒక్కో సంస్థలో 50 సీట్లు
ఎన్‌ఐటీలు
వరంగల్, కాలికట్, పుదుచ్చేరి, త్రిపుర, జలంధర్ – ఒక్కో సంస్థలో 50సీట్లు
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, హర్యానా, కశ్మీర్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇగ్నో మొదలైనవి
తెలంగాణలో అవకాశాలు
- మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్
- ఎన్‌ఐటీ వరంగల్
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, లక్సెట్టిపేట
- గీతం, పటాన్‌చెరు
- మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ, కోంపల్లి
ప్రతి కోర్సులో సుమారు 50 సీట్లు
ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలు
- జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి
- బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఎచ్చెర్ల
- హిందూ కాలేజ్, గుంటూరు
- మహరాజా కాలేజ్, విజయనగరం
- ఎంజే కాలేజ్ ఫర్ విమెన్, తెనాలి
ప్రతి కోర్సులో 50 సీట్లు
అర్హత
- ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయిలో కనీసం 50% మార్కులు
- ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులు
- వయస్సు పరిమితి లేదు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















