అమరావతి: రానున్న తుఫాన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జిల్లాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు.
సీఎస్ సూచించిన ముఖ్యాంశాలు:
- జిల్లా కలెక్టర్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలి.
- గ్రామస్థాయిలో సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలి.
- అవసరమైన నిత్యావసర సరుకులు తగిన స్థాయిలో నిల్వ చేయాలి.
- పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచి తగిన సదుపాయాలు కల్పించాలి.
- విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి.
- మొబైల్ సిగ్నల్ అంతరాయం లేకుండా టెలికాం కంపెనీలతో సమన్వయం చేయాలి.
- కాలువలు, చెరువులు, నదులను నిరంతరం పర్యవేక్షించాలి.
- ముంపు ప్రమాదాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరిక జారీ చేశారు.
ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనించి అప్రమత్తంగా ఉండాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావం తగ్గేవరకు ప్రజలు అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.


















