హైదరాబాద్: మొంథా తుపాను ప్రభావం కారణంగా ఏపీకి వచ్చే, అలాగే ఏపి నుండి హైదరాబాద్ వెళ్లే విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వెళ్లే 18 విమానాలను వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం కారణంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్ వచ్చే 17 విమానాల సర్వీసులు కూడా రద్దు చేయబడ్డాయి. రద్దయిన విమానాల్లో విశాఖపట్నం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 3 విమానాలు ఉన్నాయి.
ప్రయాణికులకు తగిన సమాచారం అందించడం కోసం ఎయిర్‌లైన్స్ అధికారులు సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేశారు.



















