హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL), రాజస్థాన్‌లో చార్జ్‌మ్యాన్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రీషియన్, డబ్ల్యూఈడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
1. చార్జ్‌మ్యాన్ (ఎలక్ట్రికల్)
- ఖాళీలు: 4
- అర్హత: డిప్లొమా/ ఐటీఐ/ 10వ తరగతి + సంబంధిత అనుభవం, సూపర్‌వైజరీ సర్టిఫికెట్
- వేతనం: ₹28,740 – ₹72,110
2. ఎలక్ట్రీషియన్ ‘ఏ’
- ఖాళీలు: 2
- అర్హత: ఐటీఐ లేదా 10వ తరగతి + అనుభవం, వైర్‌మ్యాన్ పర్మిట్
- వేతనం: ₹28,430 – ₹59,700
3. ఎలక్ట్రీషియన్ ‘బీ’
- ఖాళీలు: 3
- అర్హత: ఐటీఐ లేదా 10వ తరగతి + అనుభవం, వైర్‌మ్యాన్ పర్మిట్
- వేతనం: ₹28,280 – ₹57,640
4. డబ్ల్యూఈడీ ‘బీ’
- ఖాళీలు: 4
- అర్హత: డిప్లొమా/ డిగ్రీ/ ఐటీఐ/ 10వ తరగతి + అనుభవం, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్స్ సర్టిఫికెట్
- వేతనం: ₹28,280 – ₹57,640
5. డబ్ల్యూఈడీ ‘సీ’
- ఖాళీలు: 5
- అర్హత: డిప్లొమా/ డిగ్రీ/ ఐటీఐ/ 10వ తరగతి + అనుభవం
- వేతనం: ₹28,120 – ₹55,620
ఎంపిక విధానం:
- రాత పరీక్ష: 100 మార్కులు (MCQ విధానం)
- సబ్జెక్ట్ నాలెడ్జ్ – 80 మార్కులు
- జనరల్ నాలెడ్జ్ – 20 మార్కులు
- కనీస అర్హత మార్కులు:
- జనరల్ – 40%
- ఓబీసీ (ఎన్‌సీఎల్) – 38%
- ఎస్సీ/ ఎస్టీ – 35%
- రాత పరీక్షలో అర్హత సాధించినవారిని 1:3 నిష్పత్తిలో ట్రేడ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు
- తుది ఎంపిక రాత పరీక్ష మార్కుల ఆధారంగా ఉంటుంది
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-02-2026



















