పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, సాగు విస్తీర్ణం పెరుగుదల, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో రెండు రాష్ట్రాలు సాధించిన పురోగతిని సర్వే వివరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యాంశాలు:
- ఏపీలో ద్రవ్యోల్బణం 2022–23లో 7.57% నుంచి 2025–26 నాటికి 1.39%కు తగ్గింది
- జాతీయ సగటు 1.72% కంటే తక్కువ ద్రవ్యోల్బణం నమోదు
- రాజధాని అమరావతిని హరిత నగరంగా అభివృద్ధి చేస్తున్న అంశాన్ని సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది
- వాణిజ్య సంస్కరణల అమల్లో ఏపీ ముందంజలో ఉందని ప్రశంస
- సింగిల్ విండో విధానంతో పారిశ్రామిక అనుమతులు వేగంగా మంజూరు
- 6,900 గ్రామాల్లో 81 లక్షల భూకమతాల రీ-సర్వే పూర్తి
- 86 వేల సరిహద్దు వివాదాల పరిష్కారం
- ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదన
- దేశంలో జీవనయోగ్య నగరాల్లో విజయవాడ, తిరుపతి టాప్–10లో చోటు
తెలంగాణలో ముఖ్యాంశాలు:
- సాగు యోగ్య భూవిస్తీర్ణం 2014–23 మధ్య 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.21 కోట్ల ఎకరాలకు పెరుగుదల
- మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల సాగు విస్తీర్ణం మెరుగుదల
- తయారీ రంగంలో తెలంగాణ 5% వాటా నమోదు
- ఏఐ స్టార్టప్‌లలో 7% వాటా
- ఐటీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసుల్లో తెలంగాణ కీలక పాత్ర
- భూభారతి పోర్టల్ ద్వారా రెవెన్యూ–రిజిస్ట్రేషన్ విభాగాల ఏకీకరణ
- వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానం
- 2035 నాటికి హైదరాబాద్ జీడీపీ $201.4 బిలియన్లకు చేరే అవకాశం
ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలు ఆర్థిక పురోగతి, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో గణనీయమైన ముందడుగులు వేసినట్లు స్పష్టమైంది.



















