ఈరోజు ప్రారంభమైన సింగపూర్–విజయవాడ నేరుగా విమాన సర్వీసు తొలి ప్రయాణికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ డైరెక్ట్ సర్వీస్ ప్రారంభం రెండు ప్రాంతాల మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేసిందని వారు అభిప్రాయపడ్డారు.
అదే ఫ్లైట్‌లో ప్రయాణించిన తెలుగుదేశం ఫోరం సింగపూర్ సభ్యులు “రెండు మనసులు, ఒక హృదయం – ఆంధ్ర ప్రగతి” అని ఉన్న చంద్రబాబు మరియు లోకేష్ చిత్రాలతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించి తమ అభిమానాన్ని మరియు కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఈ నేరుగా విమాన సర్వీస్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అవకాశాలను తెరుస్తుందని వారు పేర్కొన్నారు.




















