గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇవాళ ప్రజలతో దగ్గరయ్యే ప్రయత్నంలో వందే భారత్ రైలులో ప్రయాణించారు. గాంధీనగర్ నుంచి వల్సాడ్ వరకు ఆయన టీంతో కలిసి ప్రయాణించగా, రైలులో ప్రయాణిస్తున్న వారిని మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ ప్రయాణం రాష్ట్రంలో రైలు ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న సంకేతంగా భావిస్తున్నారు.
వల్సాడ్‌లో ఈ రోజు ప్రారంభమైన 12వ చింతన్ శిబిరం కోసం సీఎం ఈ ప్రయాణం చేశారు.
‘సామూహిక ఆలోచనలతో సామూహిక అభివృద్ధి’ అనే థీమ్‌తో జరిగే ఈ శిబిరం రాష్ట్ర భవిష్యత్ విధానాలకు దారితీస్తుందనే నమ్మకం ప్రభుత్వానికి ఉంది.
ఇప్పటికే జరిగిన చింతన్ శిబిరాలు గుజరాత్‌లో పర్యాటకం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో కీలక మార్పులకు దారితీశాయి. ఈసారి డిజిటల్ గుజరాత్, ఆర్థిక అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.




















