పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారతీయులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) ప్రత్యేక కంట్రోల్‌రూంని ఏర్పాటు చేసింది.
ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారత పౌరులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. ఈ కంట్రోల్‌రూం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని అధికారులు తెలిపారు.
సహాయం అవసరమైన వారు టోల్‌ఫ్రీ నంబర్ 1800 118797ను సంప్రదించవచ్చని సూచించారు. అదనంగా +91 11 2301 2113, +91 11 2301 4104, +91 11 2301 7905 నంబర్ల ద్వారా కూడా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని ఎంఈఏ వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న లేదా పనిచేస్తున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు కొనసాగించాలని కేంద్రం సూచించింది. భారత పౌరుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















